Friday, November 22, 2024

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani inaugurates Govt 50 Beds Hospital

హైదరాబాద్: ప్రజలకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్ పేట లోని 50 పడకల హాస్పిటల్ లో రూ.74 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మినీ డయాగ్నస్టిక్ సెంటర్ ను ఎమ్మెల్సీ సురభి వాణి దేవి తో కలిసి మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించి వాటి పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్య, వైద్య రంగాలకు కార్పొరేట్ రంగాలకు దీటుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెను మార్పులు తీసుకువచ్చారన్నారు.

అతిముఖ్యమైన ఈ రెండు రంగాల అభివృద్దికి ఇప్పటికే ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. తద్వారా నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య, పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చే వారి సంఖ్య కూడా భారీగాపెరిగిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పేరుకు మాత్రమే ఇక్కడ 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేసింది తప్పతే పైసా కూడా ఇవ్వలేదన్నారు. స్థానిక ప్రజల అవసరాల మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్ళి 50 పడకల హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయించి రూ. 3.78 కోట్లతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగిందని వివరించారు. ఇక్కడ ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో స్థానికులకు వైద్య సేవల కోసం దూర ప్రాంతంలోని గాంధీ, ఉస్మానియా వంటి హాస్పిటల్స్ కు వెళ్ళే అవసరం తప్పిందన్నారు. వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తున్నా రోగ నిర్ధారణ పరీక్షల కోసం నిరుపేదలు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఆ భారం కూడా వారిపై పడకుండా ప్రభుత్వమే నగరంలోని పలు ప్రభుత్వ హాస్పిటల్స్ లో మినీ డయాగ్నస్టిక్ సెంటర్ లను ఏర్పాటు చేసిందని, అందులో భాగంగానే అమీర్ పేట లోని 50 పడకల హాస్పిటల్ లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.

ఇక్కడ 57 రకాల పరీక్షలు ఉచితంగా చేయబడతాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ హాస్పిటల్ అవసరాల కోసం ఒక అంబులెన్స్ ను త్వరలోనే మంజూరు చేయిస్తానన్న మంత్రి ఇతర అవసరాలు ఉంటే వివరాలు అందజేయాలని హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు సూచించారు. ఎల్లప్పుడు ప్రజా సంక్షేమానే ఆలోచించే గొప్ప మానవతావాది కెసిఆర్ రోగులకు అన్ని రకాల వైద్య సేవలను అందించడమే కాకుండా వారి సహాయకులకు అతి తక్కువ ఖర్చుతో కడుపు నిండ మూడు పూటాల బోజనం పెట్టేందుకు 18 ప్రధాన హాస్పిటల్స్ లలో ప్రత్యేక బోజన కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు. వివరించారు. నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కల్పిస్తున్న సౌకర్యాలను, వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, సూపరింటెండెంట్ దశరథ్, టిఎస్ డయాగ్న స్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ అరుణ్ కుమార్, కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News