హైదరాబాద్: మెట్లబావి పునురద్ధరణ పనులను స్వాతంత్ర దినోత్సవం అగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను అదేశించారు. గురువారం బన్సీలాల్‌పేట్‌లోని మెట్లబావి పునర్దురణ పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ చరిత్రకు సజీవ సాక్షంగా నిలిచే పురాతన నిర్మాణాల పరిరక్షణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా నిజాం ప్రభుత్వహాయంలో నిర్మించిన మెట్ల బావి చెత్త చేదారాలతో నిండిపోగా పూర్తిగా తొలగించిన పునరుద్దరణ పనులను చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నమని చెప్పారు. బావితో పాటు పరిసరాల అభివృద్ది కోసవ అవసరమైన స్థలాన్ని సేకరించి పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డిఎంసి ముకుందరెడ్డి, వాటర్ వర్క్ జిఎం రమణారెడ్డి, ఎస్ స్వచ్చంధ సంస్థ నిర్వాహకులు కల్పన తదితరులు పాల్గొన్నారు.
మెట్ల బావి అభివృద్ధి పనులు 15 ఆగస్టులోపు పూర్తి: మంత్రి తలసాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -