హైదరాబాద్: ఎస్‌ఆర్‌నగర్‌లో చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి తీసురానున్నమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఎస్‌ఆర్‌నగర్‌లో రూ.12 కోట్ల వ్యయంతో హౌసింగ్ బోర్డు స్థలంలో చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక ప్రజల సౌకర్యార్థం 3200 గజాల విస్తీర్ణంలో డబుల్ సెల్లార్, జీ ఫ్లస్ వన్ విధానంలో ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నమన్నారు. అయిఏత సెల్లార్ నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకాల్లో భారీ బండరాయి రావడంతో పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. అదేవిధంగా పనులు చేపట్టిన ప్రాంతంలో విద్యుత్ స్తంభాలతో పాటు సేవరేజ్ పైప్‌లైన్‌ను తొలగించాల్సి ఉండడంతో వెంటనే చర్యలను తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అంతకు ముందు భవన నిర్మాణ నమూనాను మంత్రికి అధికారులు ఫోటోల ద్వారా వివరించారు. ఈ భవనం నిర్మాణం పూరైతే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ది చెందుతుందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజల కోసం 50 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చామని, దీనిని 100 పడకలకు పెంచేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించి 15 రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆహ్వానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయాల వ్యయంతో అనేక అభివృద్ది పనులను చేపట్టామని, వీటిలో ఇప్పటికే చాల మేరకు పూర్తిగా మరికొన్ని పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఈ శ్రీనివాస్, ఈఈ రాధాకృష్ణ, డిఈ దశరథ, జోనల్ కమిషనర్ రవిశంకర్, డిసి వంశీ, వాటర్ వర్క్ సిజిఎం ప్రభు, జిఎం హరిశంకర్, టిఆర్‌ఎస్ నాయకులు సంతోష్, హన్మంతరావు, ఆశోక్ యాదవ్ కర్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.