Monday, December 23, 2024

అమ్మవారి విగ్రహం మారుస్తారనేదిఅవాస్తవం: మంత్రి తలసాని శ్రీనివాస్

- Advertisement -
- Advertisement -

Minister Talasani Inspects Ujjaini Mahankali Temple

హైదరాబాద్: మహంకాళి అమ్మవారి విగ్రహం మారుస్తారనేది అవాస్తవమని, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆర్‌జెసిరామకృష్ణ లతో కలిసి ఆలయ అధికారులు, కమిటీ సభ్యులతో ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తొలగిస్తారని కొందరు ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. భక్తులు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధి పై నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. అమ్మవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. భక్తులు, ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించే వారిని ఆ అమ్మవారే చూసుకుంటారని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేసి అబాసుపాలు కావద్దని మంత్రి శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు.

ఆలయ అభివృద్ధి విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని నిర్ధారణ చేసుకోవాలని హితబోధ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆలోచన అని తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రయివేట్ ఆలయాలకు కూడా నిధులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం మహంకాళి అమ్మవారి జాతరకు లక్షలాదిమంది తరలివస్తారని, వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. గత రెండు సంవత్సరాల పాటు కరోనా కారణంగా నిర్వహించని విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం బోనాలు, అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News