Wednesday, January 22, 2025

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం

- Advertisement -
- Advertisement -

ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన
మంత్రి తలసాని రూ.125 పథకం

మన తెలంగాణ/జనగామ ప్రతినిధి: మత్స్యకారుల సంక్షేమమే రాష్ట్ర ప్ర భుత్వ ధ్యేయమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సోమవారం జనగామ జిల్లా స్టేషన్ నియోజకవర్గంలో మం త్రి తలసాని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యతో పర్యటించి పల్లెగుట్ట వద్ద రూ.10లక్షలతో నూతనం గా నిర్మించనున్న చేపల మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. తదనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్‌లో తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్ర తిష్టాత్మకంగా రూ.125 కోట్లతో 26,778 నీటి వనరుల్లో రూ.88.53 కోట్ల ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి చేపట్టి 9.35 లక్షల చేపపిల్లలను చెరువుల్లో లాంఛనంగా ప్రారంభించి విడిచిపెట్టారు. అదేవిధంగా గొర్రెలకు పారుడు రోగం ని వారణకు వ్యాక్సిన్ పంపిణీ చేశారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడు తూ 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే మత్సకారులకు గుర్తింపు తెచ్చామని, మత్సకార్మికుల సంక్షేమం కోసం 2015 సెప్టెంబర్ 23న నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో ఉచితంగా చేపపిల్లలను పెంచాలనే సంకల్ప బలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బృహత్తర నిర్ణయం మత్సకారుల జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసినట్లైందన్నారు. 201617 నుంచి 3939 రిజర్వాయర్లలో ప్రారంభిస్తూ 26778 రిజర్వాయర్లకు పెంచిన ఘనత మా ప్రభుత్వానికే దక్కిందన్నారు. 26వేల చెరువులకు జియో ట్యాగింగ్ చేయడం జరిగిందని తెలిపారు. 27.80 కోట్లతో 90 కోట్ల చేపపిల్లలే కాకుండా రూ.20 కోట్ల రొయ్య పిల్లలు చెరువుల్లో విడిచి పెడుతున్నట్లు తెలిపారు. 2 నెలల్లో 620 సొసైటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

వెయ్యి కోట్లతో తెప్పలు, జాకెట్స్, వాహనాలు అందజేశామన్నారు. అన్ని చెరువులపై మత్సకారులకే పూర్తి హక్కులు కల్పించామని చెప్పారు. మత్స మిత్ర యాప్ ఏర్పాటు చేయడమే కాకుండా అవగాహన కల్పించారు. చేపపిల్లల నాణ్యత లేకపోయినా లెక్క ప్రకారంగా చేరకపోయినా వాహనాలను తిప్పి పంపాలని సొసైటీ సభ్యులకు తెలియజేశారు. 8 మత్సకారుల సొసైటీలకు మంత్రి అర్హత పత్రాలను అందజేశారు. పశువులకు వైద్య సేవలను తక్షణమే అందించేందుకు ప్రవేశపెట్టిన మోబైల్ అంబులెన్స్‌లకు దేశ వ్యాప్తంగా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, మత్సశాఖ కమిషనర్ భూక్య లచ్చిరాంనాయక్, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీవో కృష్ణవేణి, మత్సకారుల సొసైటీ సంఘం నాయకులు, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News