Wednesday, January 22, 2025

మన బస్తీ- మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మహార్ధశ

- Advertisement -
- Advertisement -

Minister Talasani Yadav meeting on Mana Basti - Mana Badi

హైదరాబాద్: ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపడుతోందని శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన మన బస్తీ మన బడి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, విద్యా శాఖ అధికారులతో సమావేశం హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాద్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, జాఫర్ హుస్సేన్, అహ్మద్ బిన్ బలాల, కలెక్టర్ శర్మన్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్, డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అ లీ, మేయర్ విజయలక్ష్మిలు మీడియాతో మాట్లాడారు.

గుణాత్మక విద్యకు పటిష్ట చర్యలు: మేయర్ విజయలక్ష్మి

ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యను అందించేందుకు గాను మన బస్తీమన బడి పథకం ద్వారా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసిలో పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల ఉన్నతికి సమన్వయంతో కృషి చేస్తామన్నారు. ఇంందుకు సంబంధించి జిహెచ్‌ఎంసి తరుపున అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య సంస్థల కంటే ఎక్కువగా మౌలిక సదుపాయాలను కల్పించి ప్రభుత్వ విద్యపై ఆసక్తి పెంపోందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. స్వచ్చంధ సంస్థల భాగస్వామ్యంతో అనుకున్న లక్షాన్ని సాధిస్తానన్నారు. తను ఇప్పటికే ఎన్‌బిటి పాఠశాలను దత్తతను తీసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం విద్యతో పాటు ఆసక్తి ఉన్న క్రీడలు ఇతర రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడం ద్వారా పాఠశాల కీర్తిని ప్రతిష్ట పెరిగిందని మేయర్ వెల్లడించారు.

పాఠశాలల్లోఅహ్లాదకర వాతావరణం కల్పిస్తాం:  మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్

విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించడం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం మన బస్తీ- మన బడి అనే కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. ఇందుకోసంరూ. 7,289.54 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని, నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 499 ప్రాథమిక పాఠశాలలు , 9 ప్రాథమికోన్నత పాఠశాలలు , 182 ఉన్నత పాఠశాలలు మొత్తం 690 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వివరించారు. ఆయా పాఠశాలల్లో 1,25,700 మంది విద్యార్ధులు ఉన్నారని తెలిపారు. మన బస్తి మన బడి కార్యక్రమంలో మొదటి విడతలో239 పాఠశాలల అభివృద్ధి చేయనున్నామని వెల్లడించారు. ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గంకు 10 చొప్పున అత్యవసరంగా పనులు చేపట్టాల్సిన పాఠశాలలను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

ప్రతి పాఠశాలలో విద్యుత్ సౌకర్యం, తాగునీరు, సరిపడా ఫర్నిచర్, మరుగు దొడ్ల నిర్మాణం వాటిలో నీటి సౌకర్యం కల్పించడం , కాంపౌండ్ వాల్, వంటశాల నిర్మాణం, శిధిలావస్థలో ఉన్న తరగతి గదుల స్థానంలో కొత్తవాటి నిర్మాణం వంటి అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. డిజిటల్ విద్య అమలు చేయుటకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీల సహకారంతో ప్రణాళికలు తయారు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. డిఇఓ, డిప్యూటీ డిఇఓలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. రానున్న రోజులలో ఎమ్మెల్యే లు, ఎంపిలు, ప్రతి ఒక్కరు తమ పిల్లలను పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి కనబరిచే స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేపట్టనున్నట్లు వివరించారు.

విద్యార్ధులను విద్యతో పాటు క్రీడలలో కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అయితే పలు పాఠశాలలో విద్యార్ధులకు సరిపడా క్రీడా స్థలాలు లేవని, అందుబాటులో ఉన్న జిహెచ్‌ఎంసి స్థలాలను క్రీడాస్థలాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పలువురు ఎమ్మెల్యే లు తమ దృష్టికి తీసుకొచ్చారని, వీటిని సోమవారం జరగనున్న మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో విద్య ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. దాతలు, కార్పోరేట సంస్థ సహకారం, ప్రవాస భారతీయుల సహకారంతో కూడా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News