Monday, December 23, 2024

ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ పూజల అనంతరం తెల్లవారుజామున 3:30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బోనాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా, అమ్మవారి ఆలయానికి భక్తులు ఉదయం నుంచి క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇంకా ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News