హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోళి వేడులకను ఘనంగా జరుపుకున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన సంబురాల్లో ఆయన ఉత్సాహాంగా పాల్గొన్నారు. ఇందిర పార్క్‌లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి తలసాని యువతతో కలిసి డాన్స్ చేసి వారి ఉత్సహాం నింపారు. అదేవిధంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని మొండా మార్కెట్ డివిజన్‌లోని బండ్‌మెంట్‌లో నిర్వహించిన హోళి సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ సైతం మంత్రి స్థానికులతో కలిసి ఆడుతూ వారి ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నగరవాసులకు హోళి శుభాకాంక్షలు తెలిపారు. మనం జరుపుకునే పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెబుతాయన్నారు. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా దేశం మొత్తం ఎంతో సంతోషంగా హోళీని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత మన సంస్కృతి, సాంప్రదాయాలను మరింత పెంపొందించే విధంగా ప్రభుత్వం అన్ని పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు.
హోలీ సంబురాల్లో సందడి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -