Sunday, December 22, 2024

జాతి సమైక్యతను చాటాలి: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani planted saplings in Freedom Park

హైదరాబాద్: దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఫ్రీడమ్ పార్క్ లో మంత్రి తలసాని, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, ఎంఎల్ఏ దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మొక్కలు నాటారు. ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందని మంత్రి పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ, గాంధీ గురించి విద్యార్థుల కు తెలియజెప్పేందుకు ఉచితంగా గాంధీ చిత్ర ప్రదర్శన చేస్తున్నమని తెలిపారు. వజ్రోత్సవాలలో భాగంగా 75 ప్రాంతాల్లో ప్రీ డమ్ పార్క్ లను ఏర్పాటు చేసి మొక్కలు నాటడం జరుగుతుందని తలసాని చెప్పారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగురవేసి జాతి సమైక్యత, స్ఫూర్తిని చాటాలని మంత్రి తలసాని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News