మనతెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్ఎంసి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను టిఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తమకు సంఖ్యాబలం ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో సమావేశం అయిన తర్వాత జిహెచ్ఎంసి బయలుదేరి వెళ్తామని చెప్పారు.
విప్ జారీ చేస్తాం: ఎంఎల్‌సి ప్రభాకర్‌రావు
తమ పార్టీ కార్పోరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులకు విప్ జారీ చేస్తామని ఎంఎల్‌సి ఎంఎస్ ప్రభాకర్‌రావు వెల్లడించారు. అందరూ పార్టీ నిర్ణయాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ తనకు విప్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. మంత్రి కెటిఆర్ నగరానికి సంబంధించిన మంత్రులు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారని అన్నారు.
Minister Talasani reacts on GHMC Mayor election