Wednesday, January 22, 2025

నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నంది అవార్డుల వివాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం స్పందించారు. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరుపున నంది అవార్డులు ఇస్తామని తలసాని తెలిపారు. నంది అవార్డులు ఇవ్వాలని ఎవరూ అడగలేదని ఆయన వెల్లడించారు. సినీ పరిశ్రమ నుంచి ఎవరూ సర్కారుకు ప్రతిపాదన పంపలేదన్నారు. ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత నంది అవార్డులపై సిని పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో నిర్మాతలు ఆదిశేషగిరి రావు, అశ్వినీదత్ లు నందిఅవార్డుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News