Thursday, December 19, 2024

గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష

- Advertisement -
- Advertisement -

Minister Talasani review on Golconda Bonalu 2022

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో తలసాని మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ, జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, హెల్త్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ఈనెల 30 న గోల్కొండ బోనాలతో ప్రారంభం కానున్నాయి. ఆరోజు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఈనెల 28 నుండి గోల్కొండ బోనాలు జరుగుతున్నాయి. బోనాల జాతర గోల్కొండ జగదాంబ అమ్మవారి నుండి ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ బోనాల కోసం కూడా ఏర్పాటు చేసాం. వర్షాకాలంలో రోగాల బారిన పడే వారు… ఈ రోగాల బారిన పడకుండా అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు. లక్షల మంది బోనాల జాతరకు వస్తుంటారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాల జాతర విజయవంతం చేస్తామన్నారు. అన్ని ఏర్పాట్లు చేసామని, ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించామన్నారు. భక్తులు కూడా అందరికి సహకరించి తమతమ బోనాలు సమర్పించుకోవాని మంత్రి తలసాని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News