Monday, December 23, 2024

మంత్రి తలసాని..ఆలయ ప్రాంగణంలో ఉమ్మివేయడం సంస్కారహీనం

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : బల్కంపేట రేణుక ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉమ్మివే యడం సంస్కారహీనమైన చర్య అని, హిందువులకు మంత్రి తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బిజెపి సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో మంత్రి ఉమ్మి వేయడం, ఆదృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం బర్కత్‌పురలోని బిజెపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు ఎన్.గౌత మ్‌రావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ నెల 20 బల్కంపేట రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవం జరిగింది.

ఎల్లమ్మ తల్లి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అధికారులు, పోలీసులు, భక్తులు, పార్టీ నాయకులతో కలిసి ఆలయానికి వస్తున్న క్రమంలో మంత్రి తలసాని ఆలయ ప్రాంగణంలో గుట్కా నములుతూ ఉమ్మి వేశారు. లక్షలాది మంది భక్తులు బల్కంపేట ఎల్లమ్మతల్లిని ఎంతో పవిత్రంగా కొలుస్తారు, అటువ ంటి పవిత్ర స్థలంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మంత్రి వేయటం ఎమిటని ఆయన మండిపడ్డారు. ఆలయాలకు వచ్చే భక్తులు ఎంత పవిత్రంగా భగ వంతున్ని ఆరా ధిస్తారో హిందువైన మంత్రి తలసానికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తలసాని వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలయంలో అమ్మ వారి విగ్రహాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని దీనిని తీవ్ర స్థాయిలో అడ్డుకుంటామని హెచ్చరించారు.

పలు విషయాలపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అధికార పార్టీ(బిఆర్‌ఎస్)కి ఒత్తాసు పలుకుతున్నారని, ఈ పద్దతి మార్చుకోవాలని హితవుపలికారు. అదేవిధంగా దేవాలయ అభివృద్ధికి మం త్రి తల సాని రూ. 5లక్షల చందా ఇచ్చినట్లు పెద్ద బోర్డులు ఏర్పాటు చేశారని, అయితే చందాదారుల పేర్లలో.. తలసాని పేరు లేదని ఆరోపించారు. ఆలయ ఈ వో స్పందించి… ఆ బోర్డుల ను వెంటనే తొలగించాలని… లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. నిబంధనల కు విరుద్దంగా… రాజకీయ పబ్బం కోసం మంత్రి తల సాని.. దేవాలయం వద్ద చందాబోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సంస్కారహీ నమైన చర్యలకు పోలీస్ ఉన్న తాధికారులకు, దేవాలయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News