Wednesday, January 22, 2025

కేంద్రం ఏ అభివృద్ధి పనులు చేస్తోందని.. అడ్డుకుంటున్నాం: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేస్తోందని.. అడ్డుకుంటున్నాం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎందులో సహకరించలేదో ప్రధాని చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలన్నారు. కర్నాటకలో అవినీతిపై ప్రధాని ఎందుకు మాట్లాడరు ? అని తలసాని ప్రశ్నించారు. రాష్ట్రానికి వైద్య కళాశాలలు ఇస్తే ఎవరైనా కాదన్నారా.. దేశానికి అధిక శాతం పన్నులు కడుతున్నది తెలంగాణ అన్నారు. బిజెపి ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలన్నారు. తిరుపతికి ఇప్పటికే అనేక రైళ్లు ఉన్నాయి.. కొత్తగా రైలు కనిపెట్టి ప్రారంభించినట్లు మోడీ మాట్లాడుతున్నారని తలసాని పేర్కొన్నారు. దేశంలోని అవినీతిపరులను చేర్చుకుని పునీతులను చేస్తున్నది బిజెపి అని మంత్రి తలసాని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News