Monday, December 23, 2024

చంద్రబాబు అరెస్ట్ బాధాకరం :మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్ చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. బుధవారం మంత్రి కార్యాలయంలో తలసాని మీడియాతో మాట్లాడుతూ “ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో మంత్రిగా పని చేశాను. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసింది. అధికారం శాశ్వతం కాదు.

ఒకప్పుడు కేంద్ర రాజకీయాల్లో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు పట్ల వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం. సుమారు 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు” అని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News