Monday, December 23, 2024

జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బేగంపేట లోని హరిత ప్లాజాలో బోనాల పండుగ ఏర్పాట్లపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, సిఎస్ శాంతి కుమారి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిజిపి అంజనీ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తలసాని తెలిపారు.

జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నాయని ఆయన పేర్కొన్నారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 10న రంగం కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. జూన్ 20న బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం ఉంటుందని మంత్రి తలసాని పేర్కొన్నారు. బోనాలను రాష్ట్ర పండుగగా సిఎం కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని మంత్రులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News