Saturday, November 2, 2024

త్వరలో రెండవ విడుత దళిత బంధు…

- Advertisement -
- Advertisement -

సంక్షేమ పథకాలు అభివృద్దిపనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి

హైదరాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై అధికారులు నిరంతర పర్యవేక్షించాలని పశుసంవర్ధక శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీలు ఆదేశించారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీలు నగరానికి సంబంధించి జిఓ 58, 59, ఆసరా పెన్షన్ లు, దళిత బంధు ఇతర కార్యక్రమాల అమలు పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు ఎం.ఎస్. ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బలాల,ముంతాజ్ అహ్మద్ ఖాన్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కలెక్టర్ అమయ్ కుమార్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఆర్‌డిఓలు వసంత, వెంకటేశ్వర్లు,ఎస్‌సి కార్పోరేషన్ ఈడి రమేష్, వివిధ మండలాల తహసిల్దార్‌లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ జిఓ 58 కింద వచ్చిన దరఖాస్తులను త్వరతగతిన పరిశీలించి పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న పట్టాలను వారం రోజుల్లోగా పంపిణీ చేసేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ కు సూచించారు. వృద్దులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఆత్మ గౌరవంతోబతకాలనే ఆలోచనతో ఆసరా పెన్షన్ కింద హైదరాబాద్ జిల్లా పరిధిలో 2.76 లక్షల మంది లబ్దిదారులకు ప్రతినెల రూ.67 కోట్ల ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

గత ఏడాది ఆగస్టు నుండి 57ఏళ్లు దాటిన వారికి సైతం నూతనంగా పెన్షన్ లను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పెన్షన్ కు అర్హులైన లబ్దిదారులందరికీ గుర్తింపు కార్డులను పూర్తిస్థాయిలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. లబ్దిదారులు దరఖాస్తులలో పేర్కొన్న అడ్రస్ లలో ప్రస్తుతం ఉండటం లేదని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకురాగా, అవసరమైతే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే ల సహకారం తీసుకోవాలని సూచించారు.. పెన్షన్‌కు సంబంధించి పెండింగ్ దరఖాస్తుల వివరాలు అందజేస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మంజూరుకు కృషి చేస్తామన్నారు.

త్వరలో రెండవ విడుతద ళిత బంధు
నిరుపేద దళితులను ఆర్ధికాభివృద్దే లక్షంగా ముఖ్యమంత్రి అమలు చేస్తున్న దళితబందు రెండవ విడుత త్వరలోనే ప్రారంభం కానుందని మంత్రులు తెలిపారు. ఇందుకు సబంధించిన ప్రక్రియ సిద్దమవుతోందన్నారు. మొదటి విడతలో నగరంలోని 15 ప్రతి నియోజకవర్గలుండగా 100 మంది చొప్పున మొత్తం 1484 మంది ని గుర్తించి ఒకొక్కరికి రూ.10 లక్షలతో వివిధ యూనిట్లను అందజేశామన్నారు. ఈ యూనిట్లు అన్ని సక్రమంగా పని చేస్తున్నాయా? లేదా? పరిశీలించాల్సిన బాధ్యత SC కార్పోరేషన్ అధికారులపైనే ఉన్నదని మంత్రి స్పష్తం చేశారు.

నియోజకవర్గాల వారిగా నియమించబడిన దళిత బంధు స్పెషల్ ఆఫీసర్ లు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్దిదారుల వివరాలు, యూనిట్ల సమాచారం తో కూడిన వీడియో, ఫోటో లతో కూడిన నివేదికలను సిద్దం చేసి ఆయా ఎమ్మెల్యే లకు అందజేయాలని మంత్రులు ఆదేశించారు. అదేవిధంగా సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకొనే వారికి ప్రభుత్వం రూ. 3 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించేందుకు గృహ లక్ష్మి అనేక గొప్ప ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తుందని తెలిపారు. త్వరలోనే పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు రానున్నాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News