- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం పర్యటిస్తున్నారు. ఎస్పీ రోడ్డులో పికెట్ నాలాపై నిర్మిస్తున్న వంతెన పనులను తలసాని పరిశీలించారు. వీలైనంత త్వరగా నాలా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
- Advertisement -