హైదరాబాద్: సికింద్రాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పర్యటిస్తున్నారు. ఎంజి రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను తలసాని పరిశీలించారు. ఎంజి రోడ్డు మార్గంలో గాంధీ విగ్రహం తొలగింపు ప్రచారం అవాస్తమని ఆయన సూచించారు. గాంధీ విగ్రహం తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు రోడ్డెక్కడం విడ్డూరం అన్నారు. గాంధీ విగ్రహ పరిసర ప్రాంతాల్లో సందరీకరణ చేస్తున్నామన్నారు. అదే విధంగా సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయ అధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. మహంకాళి అమ్మవారి విగ్రహం తప్పిస్తున్నారనే ప్రచారంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అవాస్తవాలు ప్రచారం చేసే వారిని అమ్మవారే చూసుకుంటుందన్నారు. కొందరు కావాలనే ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. జులై 17,18 తేదీల్లో ఘనంగా మహంకాళి జాతర ఉత్సవాలనిర్వహిస్తామని చెప్పారు.