Monday, December 23, 2024

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

minister talasani visit Bhoiguda Fire Accident place

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతిచెందారు. మృతులంతా బిహార్ కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. పదకొండు మంది మృతదేహాలను వెలికితీశామని అగ్నిమాపక అధికారి వెల్లడించారు. మృతదేహాలను గుర్తించలేని స్థితిలో ఉన్నాయన్నారు. ఘటనాస్థలిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అగ్నిప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాద ఘటనపై మంత్రి విచారణకు ఆదేశించారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News