- Advertisement -
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం మిర్చి మార్కెట్ ను సందర్శించారు. తేమశాతం పేరిట రైతులను వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారని సమాచారం అందడంతో ఆయన మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిరపకాయలు పట్టుకుని నాణ్యతను పరిశీలించిన మంత్రి, సరకు బాగానే ఉన్నా తక్కువ ధర చెల్లిస్తున్నందుకు వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యాపార లావాదేవీలను, సరకు నాణ్యతను మార్కెట్ అధికారులు పర్యవేక్షించాలని తుమ్మల ఆదేశించారు. ఇతర శాఖలను సమన్వయం చేసుకుని, రైతుకు సరైన ధర లభించేలా కృషి చేయాలని హితవు చెప్పారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నందుకు ఆగ్రహించిన మంత్రి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ను ఖమ్మం వచ్చిన తనను కలవాలని ఆదేశించారు.
- Advertisement -