- Advertisement -
రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతు భరోసా అమలు చేస్తామని తెలిపారు. ఎకరానికి రూ.7,500 చొప్పున ప్రతి సంవత్సరం రెండు పంటలకు కలిసి 15 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఇక, రైతు రుణమాఫీ కానివారికి కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఈనెలాఖరులోగా రూ.2లక్షల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.
వచ్చే నెల నుంచి రూ.2లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సర్కార్ కృషి చేస్తుందని, పంట బీమా పథకం కూడా ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని దుయ్యబట్టారు. గత పాలనలో వ్యవస్థలన్నీ కుంటుపడ్డాయని మంత్రి తుమ్మల మండిపడ్డారు.
- Advertisement -