Friday, February 21, 2025

కేంద్రం పత్తి, పసుపు, మిర్చి కొనుగోలు చేయాలి:మంత్రి తుమ్మల

- Advertisement -
- Advertisement -

సీసీఐ సెంటర్లలో రైతుల ఆధార్ ప్రామాణికత సమస్య కారణంగా నిలిచిపోయిన పత్తి కొనుగోళ్ల ప్రక్రియను వెంటనే పునరుద్ధరించి పత్తి పంటను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు మంత్రి తుమ్మల లేఖ రాస్తూ రైతులు పండించిన పత్తి, మిర్చి, పసుపు పంటలకు మద్దతు ధర ఇచ్చి కోనుగోలుచేసే విధంగా కేంద్రం వేగవంతంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో పసుపు రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులు మంత్రి దృష్టికి వచ్చిన వెంటనే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ప్రత్యక్ష కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, పసుపు రైతులకుగరిష్ట మద్ధతు ధర కల్పించి వెంటనే కొనుగోళ్లు చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకొన్న పరిణామాల కారణంగా మిర్చి ధరలు తగ్గడం వల్ల రాష్ట్రంలోని మిర్చి రైతుల ఆందోళనలో ఉన్నారని, మిర్చి రైతుల శ్రేయస్సు దృష్టా కోసం నాఫెడ్ ద్వారా మార్కెట్ ధరకు ఎండుమిర్చిని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News