- Advertisement -
తెలంగాణలో విస్తారంగా పండిన పసుపుపంటకు మద్దతు ధర కల్పించి కేంద్రం కొనుగోలుచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు బుధవారం ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ఈ ఏడాది తెలంగాణ రైతులు 42,093 ఎకరాల్లో పసుపుపంట పండించారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన మార్పుల దృష్టా క్వింటాల్ పసుపు ధర రూ.7 వేల నుంచి రూ.11వేల మధ్య కొనసాగుతున్న నేపధ్యంలో నాఫెడ్ ద్వారా మార్కెట్ ఇంటర్వేన్షన్ స్కీం (ఎంఐఎస్) కింద తెలంగాణలో రైతులు పండించిన పసుపు పంటను కొనుగోలు చేయాలని కోరారు. మార్చి నెలలో అధికమొత్తంలో పసుపు పంట మార్కెట్ కు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల తన లేఖలో పేర్కొన్నారు.
- Advertisement -