Thursday, May 15, 2025

రైతు రుణమాఫీ ప్రధాని మోదీకి కనిపించట్లేదా?: తుమ్మల

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో జరిగిన రైతు రుణమాఫీ ప్రధాని మోదీకి కనిపించట్లేదా? అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తల సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం మాట్లాడిన ఆయన.. తెలంగాణలో సంపూర్ణ రుణమాఫీ జరగలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. మాఫీ పూర్తవగానే రైతు భరోసా వేస్తామన్నారు. తాము నిత్యం రైతుల్లో తిరుగుతున్నామని, వ్యతిరేకత ఉంటే తమకు నిరసన సెగ తగిలేదని మంత్రి అన్నారు. ఒకరిది అధికారం కోల్పోయిన బాధ అని, ఇంకొకరిది.. అధికారంలోకి రావాలనే బాధ అని మంత్రి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News