Friday, November 22, 2024

కెసిఆర్ కు కాళేశ్వరం ఏటిఎం అన్నరు.. మరి విచారణ ఎందుకు చేయలే: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

అధికారం చేపట్టి నెల రోజులు కూడా కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరుపై కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.10ఏళ్లుగా కెసిఆర్ అవితీపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎందుకు విచారణ జరపలేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వర ప్రాజెక్టు ఏటిఎం అని ప్రధాన మంత్రి మోడీనే అన్నారు.. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేంద్రం మద్దతిచ్చిందని.. రూరల్ కార్పొరేషన్ ద్వారా రూ60వేల కోట్లు రుణం ఇచ్చిందని మంత్రి చెప్పారు.

మేడిగడ్డపై మాట్లాడేందుకు కిషన్ రెడ్డికి కామన్ సెన్స్ ఉండాలని ఫైర్ అయ్యారు.మేడిగడ్డ కుంగినప్పుడు కిషన్ రెడ్డి.. కెసిఆర్ ను ఎందుకు ప్రశ్నించలేదని ద్వజమెత్తారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై కేంద్రం ఎందుకు విచారణకు ఆదేశించలేదని.. కనీసం కుంగిన పిల్లర్లను పరిశీలించేందుకు కూడా బిజెపి ప్రయత్నించలదేని మంత్రి ఉత్తమ్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News