Monday, December 23, 2024

కమీషన్ల కోసమే కాళేశ్వరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గోదావరిపై కా ళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం కమీషన్లకోసమే ని ర్మించిందని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి అన్నారు. బుధవారం జలసౌధలోని త న కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై గ త ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపారు.కమీషన్ల కోసం ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో కట్టారన్నారు.ఇంకా నిర్మాణంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తి కావడానికి 1లక్ష 47వేల కోట్లు కావాలని తెలిపారు.కాళేశ్వరంలో 25వేల కోట్ల పనులు ఎలాంటి డిపిఆర్‌లు లేకుండా పనులు అలాట్ చేశారని తెలిపారు.94 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు చేసి కాళేశ్వరం ద్వారా 5 ఏళ్లలో 160 టీఎంసీ నీళ్లను మాత్రమే లిఫ్ట్ చేశారని, అందులో పంటల సాగు కోసం ఉపయోగించింది 65 టీఎంసిలు మాత్రమే అని వివరించారు. ప్రతీ ఏటా కాళేశ్వరం నుంచి 6లక్షల 50వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారని తెలిపారు.బిఆర్‌ఎస్‌పాలనలో తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జిమ్మకులు చేస్తున్నారని ఆరోపించారు.

బిఆర్‌ఎస్ నేతలు మేడిగడ్డ పై నిజాలు చెప్పకుండా తప్పులు ప్రచారం చేస్తున్నారన్నారు.గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ పూర్తిగా కూలిపోయిందన్నారు.ఇంత జరిగినా ఆ పార్టీ నేతలు తమ ప్రభుత్వానికి ఉచిత సలహాలు ఇవ్వడం హాస్యస్పదంగా ఉందన్నారు.బిఆర్‌ఎస్‌పార్టీ నేత కెటిఆర్ చలో మేడిగడ్డ పిలుపునిచ్చారని , కాళేశ్వరం మేడిగడ్డ ప్రాంతాలను తమ ప్రభుత్వం నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించలేదని , అయితే కెటిర్ అక్కడికి వెళ్లేముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబితే బాగుంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టి డిజైనర్‌గా , విజనర్‌గా, చీఫ్‌ప్లానర్‌గా వ్యవహరించినట్టు తెప్పుకున్న మాజీ సిఎం కేసిఆర్ మేడిగడ్డ బ్యారేజిని చూడాలని, ఆ తర్వాత అయినా ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. వారి చలో మేడిగడ్డ కార్యక్రమానికి అన్నివిధాలుగా సహకరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించిందన్నారు. బ్యారేజి కూలిన ప్రాంతంతో పాటు అన్నింటిని దగ్గరుండి చూపటంతోపాటు తగిన సదుపాయాలు కల్చించాలని ఆదేశించామన్నారు. స్వతంత్ర భారత్‌లో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినంతటి అవినీతి అక్రమాలు , నిధుల దుర్వినియోగం,

ప్రభుత్వ బాధ్యతారాహిత్యం ఎక్కడా చూడలేదన్నారు దేశంలో అత్యున్నత సంస్థగా ఉన్న కాగ్ కూడ తన నివేదికలో అదే విషయం తెలిపిందన్నారు. నేషనల్ డ్యామ్ సేప్టి అథారిటీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలు కూడా అదే తెలిపాయన్నారు. కాళేశ్వరంలో వేలకోట్లు దోచిన బిఆర్‌ఎస్ నేతల వైఖరి చూస్తే దొంగే దొంగా దొంగా అని అరిచినట్టు ఉందన్నారు. సిఎంగా కేసిఆర్ నియమించిన ఇంజనీరింగ్ నిపులు కమిటీ మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం తగదని ,తుమ్మిడిహెట్టివద్ద ప్రాణహితచెవెళ్ల ప్రాజెక్టు అన్ని విధాల మంచిదని నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ రాష్ట్రానికి పెద్ద గుదిబండగా మారుతోందన్నారు.

డ్యామ్‌సేప్టి నిపుణుల నివేదికపైనే మేడిగడ్డ భ్యవిష్యత్తు!
కూలిపోయిన మేడిగడ్డ బ్యారేజి భవిష్యత్తు ఏమిటన్నది జాతీయ డ్యామ్‌సేఫ్టీ నిపుణుల కమిటి ఇచ్చే నివేదికపైన ఆధారపడి ఉందన్నారు. మేడిగడ్డ ,అన్నారం , సుందిళ్ల బ్యారేజిలను పరిశీలించి నివేదిక ఇచ్చే పనిని డ్యామ్‌సేప్టీ కమిటికి అప్పగించామన్నారు. ఈ కమిటి త్వరలోనే పని మొదలు పెడుతుందన్నారు.ఈ కమిటి నివేదిక ఆధారంగా భవిషత్ చర్యలు ఉంటాయని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైన విజిలెన్స్ రిపోర్ట్ అందిందని , విజిలెన్స్ రిపోర్ట్ పై న్యాయ సలహాలు తీసుకుంటామన్నారు.లీగల్ ఒపియన్ తీసుకున్నాక చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.కేసీఆర్ కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఇన్ని చేసి కూడా కేటీఆర్ డిప్రెషన్ లో సెన్స్ లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News