Sunday, December 22, 2024

ఏపి సిఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ భేటి

- Advertisement -
- Advertisement -

అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. గురువారం శంశాబాద్ విమానాశ్రమం నుంచి విజయవాడుకు చేరిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన సతిమణి కోదాడశాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు .ఉత్తమ్ దంపతులను సిఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వనించారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ కలయికలో ఇరువురు కుశల ప్రశ్నలు వేసుకుని ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకున్నారు.

నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడిని మంత్రి ఉత్తమ్ దంపతులు అభినందించారు. మధ్యాహ్నం జరిగిన ఈ భేటి అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ భేటి కేవలం మర్యాద పూర్వకంగానే కలిసినట్లు పేర్కొన్నారు.తాజాగా జరిగిన ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి నాల్గో సారీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలిపామని ఉత్తమ్ దంపతులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News