మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగానికి సంబంధించి పంట రుణాల మాఫీలో ఉ త్పన్నమైన అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.సోమవారం జలసౌధలో ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్టారావుతో కలిసి మీ డియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని, వారికి సైతం నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వారి మాయలో పడొద్దని రైతులకు సూ చించారు. ఆధార్, రేషన్‌కార్డు వివరాలు సరిగా లేని దాదాపు ఐదు లక్షల మంది రైతుల సమాచారంపై స్పష్టత వచ్చాక వారికి కూడా రుణమా ఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ, దేశంలో ఇంతవరకు ఎప్పు డూ జరగలేదని అన్నారు. 2014 తర్వాత బీజేపీ ఎ ప్పుడూ రుణమాఫీ గురించి మాట్లాడలేదన్న ఆ యన, పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ, రైతుల కోసం ఎలాంటి మంచి పనులు చేయలేదని విమర్శించారు.
తెలంగాణ రైతులను రుణ విముక్తులను చేయాలన్న దృఢ సంకల్పం తో తాము సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని, వారికి కూడా నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామ ని మంత్రి హామీ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా లేకపోయినా రైతులను మోసం చేయడమే బీఆర్‌ఎస్‌కు అలవాటన్న మంత్రి, వారి మోసపూరిత మాటలు నమ్మవద్దని రైతులను కోరారు. బీఆర్‌ఎస్ మళ్లీ వచ్చేది లేదు, సచ్చేది లేదని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ ప్రచారం కోసం మాత్రమేనని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఏనాడూ రుణమాఫీ కోసం మాట కూడా మాట్లాడలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఒక ఫ్లాగ్‌షిప్ స్లోగన్ పెట్టి రైతుల మేలు కోసం ఒక్క అడుగు వేయలేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం, గందరగోళ పరిస్థితులను చేస్తున్న విషయాలను యావత్తు తెలంగాణ రైతాంగం గమనించాలని మనవి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ పంటకాలం నుంచే సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు.
ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది :
రాష్ట్రంలో సుమారు 8లక్షల మంది రైతులు బ్యాంకుల ద్వారా రూ.2లక్షలకు పైగా రుణం తీసుకున్నారని మంత్రి తెలిపారు . వీరు కూడా రూ.2లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని బ్యాంకులో చెల్లిస్తే వెంటనే ప్రభుత్వం నుంచి కూడా రూ.2లక్షలు రైతు ఖాతాకు జమ అవుతాయన్నారు. వీటికి ఎగువంటి డెడ్‌లైన్ లేదన్నారు. రైతులు వారీ వసులుబాటును బట్టి రుణాలు చెల్లించుకోచ్చని తెలిపారు. రాష్ట్రంలో రైతలు ఆధార్ నెంబర్లలో తప్పుగా ఉన్నవాటి సంఖ్య 1.20లక్షల మేరకు ఉన్నాయన్నారు. సాధారణంగా ఆధార్‌కార్డులో 12నెంబర్లు ఉంటాయని, 1.20లక్షలమంది కార్డుల్లో 11లేదా 13 నెంబర్లు ఉండటంతో వారికి రుణాలు మాఫీ కాలేదన్నారు. 1.60లక్షల మంది రైతుల ఆధార్‌లో ఒకపేరు , బ్యాంకు పాస్‌బుక్‌లో మరోక పేరు ఉందని , ఇటువంటి మిస్ మ్యాచ్ కారణంగా వారి రుణాలు కూడా మాఫీ కాలేదని తెలిపారు.లక్షన్నర మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో తప్పులు ఉన్నందున వీరికి కూడా రుణాలు మాఫీ కాలేదన్నారు. 4.83 లక్షల మంది రైతులకు రేషన్ కార్డులు లేవని , వారీ ఖాతాలను పరిశీలన చేయాల్సివుందన్నారు.
మొత్తంగా ఆధార్, రేషన్‌కార్డు వివరాలు సరిగా లేని రైతుల సమాచారంపై స్పష్టత వచ్చాక వారికి కూడా రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. వాటిని సవరించడానికి ప్రక్రియ మొదలుపెట్టామని మంత్రి తెలిపారు. ఈ మేరకు ప్రతి మండలంలో మండల వ్యవసాయాధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. వారు రుణమాఫీ కానీ రైతుల వివరాలను తీసుకొని పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తే రుణమాఫీ చేస్తామని వివరించారు. కొన్ని ఖాతాల్లో వివరాలు సరిగా లేకపోవడం, రేషన్‌కార్డులు లేకపోవడం వల్ల రుణమాఫీ జరగలేదని మంత్రి తెలిపారు. మండల వ్యవసాయాధికారులు ఈ సమస్యలను పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ సర్కార్ రూ.26 వేల కోట్ల రుణమాఫీ చేస్తే, తాము అధికారంలోకి వచ్చిన ఏడునెలల్లోనే రుణమాఫీ కోసం రూ.26 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టామని గుర్తుచేశారు. అర్హత ఉన్న ప్రతి కర్షకుడికి కచ్చితంగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మంత్రులతోపాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.