Sunday, December 22, 2024

ఇక బిఆర్‌ఎస్ ఖేల్ ఖతం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :తెలంగాణ లో బిఆర్‌ఎస్ పార్టీ ఖేల్ ఖతం అని, త్వరలోనే 25 మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. శనివారం మంత్రులు ఉత్త మ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలి సి జూపల్లి కృష్ణారావు గాంధీభవన్‌లో మీ డియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కెసిఆర్ అ హంకారపూరిత వైఖరి వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో కెసిఆర్ పిచ్చి పిచ్చిగా మా ట్లాడారన్నారు. పదేళ్లలో ఇరిగేషన్ మీద లక్షల కోట్ల దోపిడీ చేశారన్నారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ను బొంద పెడితే 104 మంది ఎమ్మెల్యేల నుంచి 39కి పడిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్‌కు తెలివి తక్కువ పొగరు ఎక్కువ అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవ్వరూ పడరని ఉత్తమ్ పే ర్కొన్నారు.

‘ప్రపంచంలో నువ్వొక్కడివే మే ధావివా?’ అని కెసిఆర్‌ను ఆయన నిలదీశారు. మేడిగడ్డ కుంగింది అన్నప్పుడు ఏడ పన్నావ్ కెసిఆర్ అని ఆయన ప్రశ్నించా రు. మాకు అభివృద్ధి చేయడం తెలుసు, నీ కు కమీషన్లు తీసుకోవడం తెలుసని మం త్రి ఉత్తమ్ కెసిఆర్‌ను విమర్శించారు. కెసిఆర్ లాగా పాస్ పోర్ట్లు అమ్మి, కాంట్రాక్టర్లకు బ్రోకర్ల లాగా తాను పనిచేయలేదని మంత్రి ఉత్తమ్ కెసిఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరినో తొక్కడం కాదని, ఈ ఎన్నికల్లో కెసిఆర్‌ను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కెసిఆర్ లాగా వేరే రాష్ట్రాల్లో మాట్లాడితే ఉరి తీస్తారని మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేటకు వదిలింది సాగునీళ్ళు కాదని, తాగునీరు మాత్రమే అని ఆయన చెప్పారు. కెసిఆర్ లాంటి పొగరుబోతు వ్యక్తిని తాను చూడలేదని అన్నారు. కెసిఆర్ కమిషన్ల కక్కుర్తి వల్లే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం ప్రాజెక్టుగా మారిందన్నారు. ఈ కరువు కెసిఆర్ తెచ్చింది మాత్రమేనని, కాంగ్రెస్ తెచ్చింది కాదని ఆయన తెలిపారు.

బిఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేసింది: మంత్రి జూపల్లి
కెసిఆర్ చవట దద్దమ్మ కాకపోతే ధనిక రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ప్రాంతీయడు తన ప్రాంతానికి అన్యాయం చేస్తే అదే ప్రాంతంలోనే పాతి పెట్టాలన్న సామెత ప్రకారం కెసిఆర్‌ను పాతి పెట్టాలని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం నాలుగు నెలలు అయిందని, బిఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేసిందని ఆయన ఆరోపించారు. పదేళ్లలో ఎప్పుడైనా కెసిఆర్ పంట నష్టం ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ ఫామ్ హౌస్‌లో పడుకొని ప్రభుత్వాన్ని నడిపించారని ఆయన ఆరోపించారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనను చూసి కెసిఆర్ అసూయపడుతున్నారన్నారు.

ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు అయ్యాయా? అని ఆయన ప్రశ్నించారు. 2014 నుంచి మొన్నటి వరకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కాలేదని మంత్రి ప్రశ్నించారు. కెసిఆర్‌కు దమ్ముంటే మేడిగడ్డ కాదు పాలమూరుకు పోదామన్నారు. మిషన్ భగీరథలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టంపై మాట్లాడుతున్న కెసిఆర్ ఆనాడు ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. గతంలో కాంగ్రెస్ పంట నష్టం ఇచ్చిందని కరువు వచ్చిన రైతులను ఆదుకుందని ఆయన గుర్తుచేశారు. గద్దలాగా వాలుతాం అన్న నీవు, నీ కుటుంబం ఇప్పటికే గద్దల్లాగా తినేశారని ఆయన ఆరోపించారు.

బిఆర్‌ఎస్‌కు లోక్‌సభలో ఒక్క సీటు కూడా రాదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12సార్లు ఢిల్లీకి వెళ్లివచ్చినా సోనియా, ఖర్గే అపాయింట్‌మెంట్ ఇచ్చారన్నారు. అదే కెసిఆర్ హైదరాబాద్‌లో ఉన్నా మంత్రులను కలవలేదన్నారు. ఆయన తలకిందులుగా తపస్సు చేసినా లోక్‌సభలో ఒక్క సీటు కూడా రాదన్నారు. కెసిఆర్ వ్యవహారాలన్ని తామంతా పక్కనుండి చూశామన్నారు. ఇకపై కెసిఆర్‌ను తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని జూపల్లి అన్నారు. తన ఫోన్‌తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు.

నా ఫోన్ నుంచి పొంగులేటికి ఫోన్ వెళ్లినట్లు, మాట్లాడినట్లు రావడంతో దీనిపై గతంలోనే తాము ఫిర్యాదు చేశామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. మా దగ్గర ఉన్న ఆధారాలు దర్యాప్తు అధికారులకు ఇచ్చామన్నారు.. ఫోన్లు ట్యాప్ చేశారు అనే దానికి ఇది ఉదాహరణ అని, ఈ అంశంలో ఎవరిని వదిలేది లేదని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. నాలుగు వేల పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చామని.. ఇవ్వబోతున్నామని వెల్లడించారు. గతంలో కుర్చీ వేసుకొని చేయిస్తా అని చాల హామీలు ఇచ్చావ్. మళ్లీ కొత్తగా అదే పాట పడుతున్నావ్. పదేళ్లు సీఎంగా పని చేసిన నువ్వు పాలమూరుకు ఎమ్ చేసావో చెప్పు . మిషన్ భగీరథలో వేల కోట్ల కుంభకోణం జరిగింది” అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.

కెసిఆర్ మేము కౌంటర్ ఇస్తే మీ తల ఎక్కడ పెట్టుకుంటారు..? మంత్రి పొన్నం
రవాణా, బిసి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శుక్రవారం కరీంనగర్‌కు వచ్చిన కెసిఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ అత్తగారి ఊరు కొదురు పాకలో నిల్చొని అడుగుదాం ఎవరు ఏంటని మీరు మాట్లాడిన భాషకు మేము కౌంటర్ ఇస్తే మీ తల ఎక్కడ పెట్టుకుంటారో తెలియదన్నారు. నీళ్ల కోసం మీరు కష్టపడితే ఆ నీటిని దొంగ పాసు పోర్టులతో విదేశాలకు పంపలేదా, సిరిసిల్ల శాసన సభ్యుడు, మాజీ మంత్రి కెటిఆర్‌ను అడుగుతున్నానన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టే కాలవలు తీస్తే నీళ్లు ఏమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి నుంచి దిగిపోయానన్న అసహనంతో మాట్లాడుతున్నానన్నారు.

సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉన్న బకాయిలు మీ ప్రభుత్వం చేసింది కాదా, కుక్కల కొడుకుల్లారా , లత్కోర్ అని ఎవరిని అంటున్నావ్, అక్కడ ఉన్న ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, బిసి ఎమ్మెల్యేను అంటున్నావా, కెసిఆర్ ఒళ్లు, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడు, 50 వేల మందితో మమ్మల్ని తొక్కుతావా , మేము మిమ్మల్ని తొక్కుతామ అన్నది చూసుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. నాలుగు నెలల తరువాత బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నావ్, 5 సంవత్సరాలు నువ్వు ఎంపి, నేను ఎంపిని, నువ్వు ఏం చేశావో, నేను ఏం చేశానో చర్చకు చేద్దాం, నీ కూతురు కవితను లిక్కర్ స్కాం నుంచి బయటకు తీసుకురా, అప్పుడు చూద్దాం, పెద్ద మనిషిగా గౌరవంగా మాట్లాడంటూ కెసిఆర్‌కు మంత్రి పొన్నం చురకలు అంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News