- తెలంగాణపై కెసిఆరే కుట్ర చేసిండు.. జగన్ నీటిని దోచుకుంటుంటే సైలెంట్ గా ఉన్నడు
- నీటి పారుదల రంగాన్ని కెసిఆర్ సర్వనాశనం చేసిండు
- 8 టిఎంసిల నీటిని జగన్ దోచుకుంటుంటే.. 2 టిఎంసిల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన కెసిఆర్
- సచివాలయంలో కృష్ణా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియా సమావేశం
జగన్ నీళ్లను ఎత్తుకుపోతుంటే కెసిఆర్ ఎకాంత చర్చల్లో మునిగిపోయారని… మనకు రావాల్సిన 8 టిఎంసిల నీటిని జగన్ దోచుకుంటుంటే కెసిఆర్ సైలెంట్ గా ఉన్నాడని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం 2 టిఎంసిల కోసం రూ.లక్ష కోట్లతో కెసిఆర్ కాళేశ్వరం కట్టాడన్నారు. ఆదివారం సచివాలయంలో కృష్ణా ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్ల విషయంలో తెలంగాణకు కెసిఆరే కుట్ర చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైలెవల్ మీగింగ్ కు.. రాయలసీమ లిఫ్ట్ కోసమే కెసిఆర్ హాజరుకాలేదని చెప్పారు. బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింతలో మా ప్రమేయం ఏం లేదు.. ప్రాజెక్టులను ఎట్టిపరిస్థితుల్లోనూ బోర్డుకు అప్పగించమని మంత్రి స్పష్టం చేశారు. నీటి పారుదల రంగాన్ని కెసిఆర్ సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు. రూ.95 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయే పరిస్థితిలో ఉందని.. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: తెలంగాణకు రావాల్సిన నీటీ వాటాను కెసిఆర్ ఆంధ్రాకు అప్పజెప్పాడు: సీఎం రేవంత్ రెడ్డి