కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి మురళీధరన్ కాన్వాయ్‌పై స్థానికులు గురువారం దాడి చేశారు. వెస్ట్ మిడ్నపూర్ జిల్లా పంచఖుడి ప్రాంతంలో మురళీధరన్ కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి చేసిన దుండగులు ఆయన కారును వెండించి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో తన వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయని మురళీధరన్ ట్వీట్ చేశారు. టిఎంసి గూండాలే ఈ దాడి చేసినట్లు కేంద్ర మంత్రి ఆరోపించారు. దీనికి సంబంధించి తాను కేంద్రానికి నివేదిక అందజేస్తానని కూడా ఆయన చెప్పారు. ఈ దాడిలోమంత్రి కారు ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో మంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెల2న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండపై వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి మురళీధరన్ బెంగాల్ వచ్చారు. అయితే కేంద్ర మంత్రి ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అజిత్ మైత్రీ తోసిపుచ్చారు. బిజెపి పట్ల ప్రజల్లో ఒక్కసారిగా పెల్లుబుకిన ఆగ్రహం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. బిజెపి నేతలు జిల్లాలో ఉద్రిక్తతలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజలను రెచ్చగొడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.
TMC goons attacked my convoy in West Midnapore, broken windows, attacked personal staff. Cutting short my trip. #BengalBurning @BJP4Bengal @BJP4India @narendramodi @JPNadda @AmitShah @DilipGhoshBJP @RahulSinhaBJP pic.twitter.com/b0HKhhx0L1
— V Muraleedharan / വി മുരളീധരൻ (@VMBJP) May 6, 2021
Minister V Muraleedharan’s Convoy Attacked in Bengal