Monday, December 23, 2024

అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి మంత్రి వేముల భరోసా

- Advertisement -
- Advertisement -
2.50 లక్షల రూపాయల ఎల్‌ఓసి అందజేత

హైదరాబాద్ : బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన ఎ. రాజేందర్ గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స కొరకు 2.50 లక్ష రూపాయల ఎల్‌ఓసిని మంజూరు చేయించి ఆ కాపీని కుటుంబ సభ్యులకు మంత్రి హైదరాబాద్‌లో అందజేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News