Monday, December 23, 2024

నిఖత్ జరీన్ కు అభినందనలు తెలిపిన మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ చేజిక్కించుకున్న నిజామాబాద్ బిడ్డ బాక్సర్ నిఖత్ జరీన్, తాజాగా మధ్యప్రదేశ్, బోపాల్‌లో జరిగిన 6వ జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హార్షం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన తుది పోరులో రైల్వేస్ (ఆర్‌ఎస్‌పిబి) బాక్సర్ అనామికతో తలపడి ఏకపక్ష విజయం నమోదు చేసింది. 50 కేజీల మహిళల ఫైనల్లో నిఖత్ 41తో రైల్వేస్ బాక్సర్ అనామికపై గెలుపొందింది.

పోరు ఆరంభం నుంచే వరుస పంచ్‌లతో విరుచుకుపడిన నిఖత్‌కు, అనామిక కనీస పోటీనివ్వలేకపోయింది. నిజామాబాద్ గడ్డ కీర్తి ప్రతిష్టలు, తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని చిరస్థాయిగా నిలిచిపోయేలా తన ప్రతిబను కనబరుస్తున్న నిఖత్ జరీన్‌కు మంత్రి వేముల శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News