Sunday, February 23, 2025

ఆపదలో ఉన్న పేదలకు మంత్రి వేముల భరోసా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  బాల్కొండ నియోజకవర్గంలో ఆపదలో ఉన్న పేదలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. అనారోగ్యం బారిన పడి మంత్రి దగ్గరికి వచ్చిన వారికి వ్యక్తిగతంగా ధైర్యం చెప్పడమే కాకుండా ఆర్ధిక సాయం అందిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. కెసిఆర్ సహకారంతో సిఎం సహాయ నిధి నుంచి కోట్ల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తూ పేద వారికి బాసటగా నిలుస్తున్నారు. పార్టీలకు అతీతంగా సాయం అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు.

బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన ఎం.హరిచందన అనే 8 ఏళ్ల చిన్నారి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆమెను హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేయించి చికిత్స కొరకు రూ.2,50,000 ఎల్‌ఓసిని మంజూరు చేయించారు. దీనికి సంబంధించిన కాపీని బుధవారం చిన్నారి తండ్రి భాస్కర్ గౌడ్‌కు మంత్రి అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News