Monday, December 23, 2024

అన్ని వర్గాల ప్రజల అభివృద్దే కెసిఆర్ ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -
భారత దేశం సుభిక్షంగా ఉండాలంటే కెసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్: అన్ని వర్గాల ప్రజల అభివృద్ది, సంక్షేమమే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మోర్తాడ్,ఏర్గట్ల మండలాలకు చెందిన పలు కుల సంఘాల భవనాల ప్రొసీడింగ్స్ కాపీలు ఆయా గ్రామాల సంఘ నాయకులకు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. దేశంలోనే కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ఏకైక సర్కార్ కెసిఆర్ సర్కార్ అన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సబ్బండ వర్ణాలు సంబురంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో కులాలు,మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతూ బిజెపి దేశాన్ని అధోగతి పాలుచేస్తున్నదని మండిపడ్డారు. యావత్ భారత దేశం సుభిక్షంగా ఉండాలంటే కెసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి వేముల స్పష్టం చేశారు.

మండలాల వారిగా సంఘ భవనాలు వివరాలు:
ఏర్గట్ల మండలం:
1.బట్టాపుర్ – మహిళ భవనం కాంపౌండ్ వాల్,టాయిలెట్స్ 4 లక్షలు,
2.నాగేంద్ర నగర్ – మహిళా భవనం 5లక్షలు
3.తడ్పాకల్ – పద్మశాలి సంఘం 4 లక్షలు
4.తడ్పాకల్ – రజక, నాయి బ్రాహ్మణ సంఘం 4లక్షలు
5.తడ్పాకల్. – విశ్వ బ్రాహ్మణ సంఘం 4లక్షలు
6. ఏర్గట్ల – మున్నూరు కాపు సంఘం 5 లక్షలు
7. ఏర్గట్ల – గంగపుత్ర సంఘం 6 లక్షలు
8.విశ్వ బ్రాహ్మణ సంఘం – 5 లక్షలు
మోర్తాడ్ మండలం:
1. దర్మోర – మాల సంఘం 5లక్షలు
2.దొన్కల్ – గురడి కాపు సంఘం 5లక్షలు
3. దొన్కల్ – విశ్వ బ్రాహ్మణ సంఘం 5లక్షలు
4. దోన్పాల్ – ముత్యాల సంఘం 5 లక్షలు
5.దొన్పాల్ – ఒడ్డెర సంఘం 4 లక్షలు
6.పాలెం – విడిసి బిల్డింగ్ 5 లక్షలు
7.పాలెం – గురడి రెడ్డి సంఘం 6 లక్షలు
8. పాలెం – కబ్రస్తాన్ 5 లక్షలు
9. సుంకెట్ – శ్రీ కృష్ణ యాదవ సంఘం 5 లక్షలు
10. సుంకేట్ – మాల సంఘం 5 లక్షలు
11. తిమ్మాపూర్ – దుబ్బ రాజేశ్వర స్వామి టెంపుల్ ప్రహరీ గోడ 5 లక్షలు
12. తిమ్మాపూర్ – సి.సి ఫ్లోరింగ్ శ్రీ వేంకటేశ్వర స్వామి టెంపుల్ 5లక్షలు
13. వడ్యాట్ – ముధిరాజ్ సంఘం 5 లక్షలు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News