Monday, January 20, 2025

అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

భీమ్‌గల్ : భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. 5 కోట్ల వ్యయంతో నిర్మించే పిప్రి నుండి ముచ్కూర్ డబుల్ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సరదగా పిల్లలతో మాట్లాడుతూ వారితో సెల్పీ దిగారు. పిప్రి నుండి లొద్ది రామన్న టెంపుల్ ఫార్మేషన్ 3.2 కోట్ల వ్యయంతో తాండ వద్ద శంకుస్థాపన చేసిన మంత్రి వేముల అదే వర్షంలో అడవి ప్రాంతంలో ఉన్న టెంపుల్ వద్దకు చేరుకొని 75 లక్షలతో టెంపుల్ వద్ద స్లాబ్ కల్వర్ట్ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం రాముల వారి మందిరంలో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. బాల్కొండ నియోజక వర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతుందని మంత్రి వేముల చెప్పారు. అందులో భాగంగా భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామంలో పలు అభివృద్ధి పనులకి ఆహ్లాదకరమైన వాతావరణంలో శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పిప్రి గ్రామ ప్రజలకు ఎల్లప్పుడు బాధ్యతగా పనులను చేస్తానని ఇంకా మునుముందు అభివృద్ధి పనులు చేసుకొందాం అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎస్పీ ప్రవీన్‌కుమార్, ఎంపిటిసి అరిగేలా సరిత స్వామి, జెడ్పిటిసి రవి, ఎంపిపి మహేష్, బీమర్తి రాజేశ్వర్, అరుగుల జనార్ధన్, మాజీ సర్పంచ్ రాజేందర్ గౌడ్, రంజిత్ రాజు తంశ రాజేశ్వర్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News