Friday, December 20, 2024

పేదవారి సొంతింటి కలను సిఎం కెసిఆర్ నెరవేరుస్తున్నారు..

- Advertisement -
- Advertisement -

Minister Vemula inaugurates Double Bedroom houses

హైదరాబాద్: పేద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర గృహనిర్మాణ, ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ బండ మైసమ్మ నగర్ లో రూ.27.20 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణి దేవిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు పత్రాలు, ఇంటి తాళాలను అందజేశారు.

 ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మురికి కూపాలను తలపించేలా ఉన్న బస్తీలలో సరైన వసతులు లేక ఇరుకు ఇండ్లలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. పేద ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇండ్లను నిర్మించి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లబ్ధిదారులపై ఒక్క పైసా భారం పడకుండా ప్రభుత్వమే ఉచితంగా ఇండ్లను నిర్మించి ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యవేక్షణలో నగరంలో లక్ష ఇండ్లు నిర్మించాలని నిర్ణయించగా ఇప్పటికే 60 వేల ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, అందులో 23 ప్రాంతాలలో ఇండ్లను లబ్ధిదారులకు అందజేసినట్లు చెప్పారు. ఒక్క సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోనే 7 ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు ఇవ్వడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. ముఖ్యమంత్రి కలను నెరవేర్చిన ఘనత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు దక్కుతుందని చెప్పారు. అన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలలో దేవాలయాలను మంత్రి శ్రీనివాస్ యాదవ్ తన సొంత నిధులతో నిర్మించారని, ఇదే స్ఫూర్తితో తన నియోజకవర్గ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలలో కూడా దేవాలయాల నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. గతంలో వేసవిలో త్రాగునీటి కోసం మహిళలు రోడ్లపైకి వచ్చే వారని, నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటిని అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా వృద్ధులు, వితంతువుల గౌరవం పెంపొందించేలా 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2116 రూపాయలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీర్ కే దక్కుతుందని చెప్పారు.

Minister Vemula inaugurates Double Bedroom houses

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News