Wednesday, January 22, 2025

సికింద్రాబాద్ స్టేషన్ ఘటన దురదృష్టకరం: మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

Minister Vemula on Secunderabad railway station incident

 

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన పై మంత్రి వేముల స్పందించారు. రైల్వే పోలీసు బలగాల కాల్పుల్లో ఒకరి మృతి చెందడం,పలువరు గాయపడటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మొన్న కిసాన్ ను నేడు జవాన్ ను రోడ్డు మీద పడేసిన ఘనత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కే దక్కుతుందన్నారు. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలను తమ మిత్ర కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ..మరో పక్క పెట్రోల్,డీజిల్ ,గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచి లక్షల కోట్లు అక్రమంగా ఆదాయం పొందుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం,దేశ రక్షణను గాలికి వదిలేసి బేరాలాడుతూ ఖర్చుకు వెనుకాడుతున్నదని మండిపడ్డారు. అగ్నిపథ్ పథకం తెచ్చి దేశ రక్షణ కోసం తమ సేవలు అందించాలనుకునే ఆసక్తిగల దేశ యువతను బీజేపీ ఘోరంగా అవమానిస్తోందన్నారు.

దేశాన్ని సాకే రైతన్నలను, దేశానికి రక్షణగా నిలిచే సైనికులను నిర్లక్ష్యంగా చూడటం హేయనియమన్నా ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అల్లర్ల వెనుక టిఆర్ఎస్ ఉందని ఆరోపణలు చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శం అన్నారు. మరి బీహార్, ఉత్తరప్రదేశ్ లలో జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరున్నారు.? అక్కడ టిఆర్ఎస్ ఉన్నదా..? ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే మూర్ఖపు బీజేపీ నిర్ణయాల వల్ల నేడు దేశ వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లు కనిపిస్తలేవా..? బండి సంజయ్ లాంటి రెచ్చగొట్టే నేతల వల్లే దేశంలో అశాంతి, అభద్రత అన్నారు. ఆందోళన చేస్తున్న యువత సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై శాంతి యుతంగా,ప్రజా స్వామ్య బద్దంగా పోరాడుదామని సూచించారు. జీవితం చాలా విలువైనది. న్యాయమైన డిమాండ్ ను గాంధేయ మార్గంలో శాంతి యుతంగా, పరిష్కరించుకుందామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించొద్దు, అది మన ఆస్తి. నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్ ల పరిష్కారం పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో వ్యవహరించాలని,సత్వర పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News