Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ నాయకత్వంలోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన : వేమలు ప్రశాంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సుభిక్షంగా ఉందని రైతులు, పేదలు రెండు కళ్లుగా సంక్షేమ పాలన అందిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో కమ్మరపల్లి మండలానికి చెందిన బిజెపి, బిఎస్‌పి, కాంగ్రెస్ నాయకులు, రైతు నాయకులు బిఆర్‌ఎస్ పార్టీ చేరారు. బాల్కొండ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీలోకి వస్తున్నట్లు వెల్లడించారు.

నేడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆయన దార్శనిక పాలనతో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా ఉందన్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ మోడల్ అభివృద్ది పాలన కావాలని కోరుకుంటున్నారని, సిఎం కెసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. మూడు పార్టీలకు చెందిన నాయకులు పన్నాల గంగారెడ్డి, ముత్యాల లక్ష్మణ్‌గౌడ్, సింగిరెడ్డి ముత్యం రెడ్డి, సింగిరెడ్డి గంగారెడ్డి, కూలిపాటి గంగారెడ్డి, గోవింద్ గంగాధర్, కొమ్ముల కిషన్, రైతు నాయకులు కొమ్ముల రాజేందర్, కొమ్ముల శ్రీధర్, మహిపాల్, సింగిరెడ్డి బాలకృష్ణ, సింగిరెడ్డిబాల్‌రెడ్డి, వేముల మెహన్, వేముల శివారెడ్డి, రేంజర్ల రోహిత్, సింగిరెడ్డి జలపతి రెడ్డి, గోపిడి రాజేందర్, సంత రాజేందర్, కొమ్ముల రాజేందర్ తదితరులు పార్టీలో చేరారు.

ఈకార్యక్రమంలో స్దానిక బిఆర్‌ఎస్ నాయకులు పార్టీ అధ్యక్షులు రేగుంట దేవేందర్, కమ్మర్‌పల్లి సర్పంచ్ గడ్డం స్వామి, అహ్మద్, లుక్కా గంగాధర్, బద్దం చిన్నారెడ్డి, బద్రి రాజేశ్వర్‌రెడ్డి, హల్దేద శ్రీనివాస్, సుమన్, సంత రాజేశ్వర్, పాషా కోఅప్షన్, సుధాకర్, హరీష్‌రెడ్డి, మహేందర్, బొడ దేవేందర్, సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News