Sunday, December 22, 2024

ప్రతి గడపకు సంక్షేమాభివృద్ధి పథకాలు: మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకెళ్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో రూ. 33 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమం తరహాలో కొనసాగిన మిషన్ కాకతీయ కార్యక్రమం ఫలితంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ నిండుగా నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు.

ప్రభుత్వ వైద్యం ఎంతో మెరుగుపడి సామాన్య ప్రజలకు కూడా ఉచితంగా అధునాతన సేవలు అందుతున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ జనరంజక పాలనలో ఇంటింటికి, ప్రతి గడపకు సంక్షేమాభివృద్ధి పథకాలు చేరాయని అన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలుస్తూ, మరింత అభివృద్ధి కోసం బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News