Thursday, January 23, 2025

అనారోగ్యం బారిన పడిన మహిళకు మంత్రి వేముల సాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  నియోజకవర్గంలో ఆపదలో ఉన్న పేద వారికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా నిలుస్తు న్నారు. అనారోగ్యం బారిన పడి మంత్రి దగ్గరకు వచ్చిన వారికి వ్యక్తిగతంగా ధైర్యం చెప్పడమే కాకుండా ఆర్ధిక సాయం చేస్తున్నారు. కెసిఆర్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్ల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తూ పేదలకు పెద్దదిక్కుగా నిలుస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఎ.లక్ష్మీ అనే మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది.

Also Read: ఎవి సుబ్బారెడ్డిపై దాడి..భూమా అఖిలప్రియ అరెస్ట్

ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆమెను హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ చేయించి చికిత్స కొరకు రూ.2,50,000 లక్షల ఎల్‌ఓసిని మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎల్‌ఓసి కాపీని బుధవారం బాధిత మహిళ కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. తాము చికిత్స కొరకు అంత ఖర్చు భరించలేమని మంత్రి దృష్టికి తీసుకురాగానే చికిత్స కొరకు రెండున్నర లక్షల ఎల్‌ఓసిని మంత్రి మంజూరు చేశారని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. ప్రశాంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News