Monday, December 23, 2024

మంత్రి ప్రశాంత్ రెడ్డికి మాతృ వియోగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గురువారం తల్లి మంజులమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి వేముల సురేందర్ రెడ్డి కూడా ఆనారోగ్యంతో ఏడేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి తల్లి మంజుల మానసికంగా కృంగి పోయింది. ఆనారోగ్యం పాలైంది. గతంలో బ్రేయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. దీంతో అప్పట్నుంచి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది. రెండు నెలలుగా హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించి హాస్పిటల్‌లోనే మృతి చెందారు. వేముల ప్రశాంత్‌రెడ్డికి తల్లి మృతి చెందటంతో బాల్కొండ నియోజక వర్గంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన స్వగ్రామం వేల్పూరు మండల కేంద్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

సిఎం కెసిఆర్ సంతాపం
మంజులమ్మ మృతి పట్ల సిఎం కెసిఆర్, స్పీకర్ పోచారం, మంత్రి కెటిఆర్, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితలు సంతాపం తెలియజేశారు. వీరితో ఇతర మంత్రులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. మంజులమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News