Sunday, November 24, 2024

వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ దవాఖానపై మంత్రి వేముల స‌మీక్ష‌

- Advertisement -
- Advertisement -
Minister Vemula review on Warangal multi-super speciality hospital
హాస్పిటల్ నిర్మాణంపై మంత్రి వేముల సమీక్ష

హైదరాబాద్ : వరంగల్‌లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం,బిల్డింగ్ డిజైన్, ఇతర అంశాలపై ఆర్‌అండ్‌బి,మెడికల్ అండ్ హెల్త్ శాఖల అధికారులతో గురువారం రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్‌లో అత్యధునాతన సౌకర్యాలతో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారని మంత్రి వేముల అన్నారు. భారత దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిన అనుభవం గల ముగ్గురు ఆర్కిటెక్‌లతో గురువారం మంత్రి స్వయంగా మాట్లాడారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనల మేరకు దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన అన్ని విభాగాల సమూహంతో కూడిన ఆస్పత్రిగా ఉండే విధంగా ప్లాన్లు తయారు చేయించాలని ఆర్కిటెక్ట్‌లకు మంత్రి సూచించారు. మంగళవారంలోగా హాస్పిటల్ డిజైన్స్,ఎలివేషన్‌లతో కూడిన ప్లాన్స్ సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి,ఆర్‌అండ్‌బి ఇఎన్‌సి గణపతి రెడ్డి,నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ,టిఎస్‌ఎంఎస్‌ఐడిసి డైరెక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Minister Vemula review on Warangal multi speciality hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News