Thursday, February 6, 2025

మోత్కూర్ లో నేడు మంత్రి వెంకట్ రెడ్డి పర్యటన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో పర్యటించనున్నారు. మున్సిపాలిటీ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ కార్యదర్శి కారుపోతుల వెంకన్న తండ్రి యాకయ్య ఇటీవల మరణించగా ఆ కుటుంబాన్ని, మున్సిపల్ పరిధిలోని కొండగడప గ్రామంలో ఇటీవల మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం మంత్రి వెంకట్ రెడ్డి ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్టు డిసిసి ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, మండల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ బుధవారం విలేకరులకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News