Monday, January 20, 2025

గోపాల్‌రెడ్డి కుటుంబానికి పరామర్శించిన మంత్రి

- Advertisement -
- Advertisement -

తుంగతుర్తి: మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కేతిరెడ్డి గోపాల్‌రెడ్డి మాతృమూర్తి కేతిరెడ్డి మనోహార ఇటీవలే మరణించడంతో సోమవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి స్థానిక శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్‌తో కలిసి పరామర్శించారు.

అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఆయన వెంట మునుగోడు శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌ఎ రజాక్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News