Sunday, December 22, 2024

బేగంబజార్ చేపల మార్కెట్‌ను సందర్శించి మంత్రి

- Advertisement -
- Advertisement -

గోషామహల్: పేద చేపల వ్యాపారులు ఇక్కడి నుంచే వ్యాపారం చేసి ఆర్ధికంగా పురోగతి చెందేందుకు అనుగుణంగా వారికి సకల సౌ కర్యాలు కల్పించామని రాష్ట్ర పశు సంవర్దక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన బేగంబజార్‌లోని చేప ల మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా నూతనంగా నిర్యించిన భవనంలో చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేయక పోవడం వల్ల ఎదుర్కొంటున్న స మస్యలను వ్యాపారులు మంత్రి దృష్టికి తెచ్చారు.

ఏళ్ల తరబడి ఇక్కడే చేపల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యాపారులను గుర్తించి, అర్హులైన వ్యా పారులకు స్టాళ్లను కేటాయించే బాధ్యతను బేగంబజార్ కార్పోరేటర్, జిహెచ్‌ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ జి శంకర్‌యాదవ్, గోషామహల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఇంచార్జి నందకిశోర్‌వ్యాస్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్‌లకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్, పూజావ్యాస్ బిలాల్, ఎం శ్రీనివాస్ గౌడ్, పప్పు మాత్రే, మేకల విష్ణువర్దన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News