Wednesday, January 22, 2025

బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు మంత్రి వార్నింగ్

- Advertisement -
- Advertisement -

 

Ashwani Vaishnaw

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ గట్టి హెచ్చరిక చేశారు. సర్కారీ మనస్తత్వాన్ని వదులుకోవాలని సూచించారు. ఇటీవలే బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ.1.64 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ సీనియర్ యాజమాన్యంతో మంత్రి సమావేశం నిర్వహించారు.
‘‘ఆశించిన మేరకు మీరు పనిచేయాలి. లేదంటే ప్యాకప్ చేసుకోవాల్సిందే. ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇకమీదట ఇదే సాధారణ నియమం. పనిచేయడమా లేదంటే వెళ్లిపోవడమా’’ అని మంత్రి బిఎస్ఎన్ఎల్ టాప్ ఉద్యోగులకు తేల్చి చెప్పారు. ఎంతో పోటీతత్వంతో పనిచేయాలని సూచించారు. టాప్ ప్రైవేటు కంపెనీలతో పోటీ పడాల్సి ఉంటుందన్నారు.

‘‘పనిచేయడం ఇష్టం లేని వారు స్వచ్ఛందంగా పదవీ విరమణ (విఆర్ఎస్) తీసుకుని ఇంటికి పోవాలి. వారు విఆర్ఎస్ తీసుకోవడానికి ముందుకు రాకపోతే మేమే 56జె నిబంధన వాడతాం’’ అని మంత్రి పేర్కొన్నారు. బిఎస్ఎన్ఎల్ ఎక్స్ఛేంజ్ లు, కార్యాలయాల్లో అపరిశుభ్ర వాతావరణాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. మెరుగ్గా పని చేయకపోతే ఉన్నతోద్యోగులను సైతం తొలగిస్తామని, ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News