Sunday, November 17, 2024

జల్‌పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

- Advertisement -
- Advertisement -

చార్మినార్: జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 3 కోట్ల 20 లక్షల రూపాయల నిధులతో బుధవారం సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థ్ధాపనలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టాణాభివృద్ధ్దిశాఖ మంత్రి కెటిఆర్ సహాకారంతో మహేశ్వరం నియోజవర్గ కార్పొరేషన్లు, మున్సి పాలిటీలలో కోట్లాది రూపాయల ని ధులతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆమె గుర్తు చేశారు.

ఇటీవ లే మహేశ్వరం పర్యటనలో ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు కార్పొరేషన్లకు 50 లక్షల చొప్పున వందకోట్ల రూపాయల నిధులను , రెండు మున్సిపాలిటీలకు 25 లక్షల చొప్పున 50 లక్షల రూపాయల నిధులను కేటాయిస్తూ వరాలజ ల్లు కురిపించారని ఈ నిధులతో ప్రజలకు కనీస సౌకర్యాలతోపాటు అభివృద్ధ్దికి ప్రాదాన్యత ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. 168 కోట్ల రూపాయల ని ధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నియోజకవర్గ ప్రజల తరపు న మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ఇందులో జల్‌పల్లికి 25 కోట్ల రూపాయ లు నిధులు విడదలయినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం జల్‌పల్లి మున్సిపాలిటీలో వందకోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయ ని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రంలో జల్‌పల్లి మున్సిపాలిటీ చైర్మెన్, వైస్‌చైర్మెన్లతో పాటు మున్సిపాలిటీ కౌన్సిలర్లు ,నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News