Saturday, December 28, 2024

మేడిగడ్డకు బయలుదేరిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రులు, నీటిపారుదల అధికారులు మెడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు బయలుదేరారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వివేక్, ఈ ఎన్ సి మురళీధర్ హెలికాప్టర్ లో బయలు దేరారు. కొద్దిసేపట్లో మేడిగడ్డకు మంత్రులు చేరుకోనున్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ లో దెబ్బతిన్న పిల్లర్లను మంత్రులు పరిశీలించనున్నారు. అక్కడ నుంచి అన్నారం ప్రాజెక్టును సందర్శస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News